Ankita murder case: రిసార్ట్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం జరిగేదని వెల్లడించిన మాజీ ఉద్యోగి

ABN , First Publish Date - 2022-09-27T22:30:59+05:30 IST

ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల రెసెప్షనిస్ట్ అంకిత భండారి (Ankita Bhandari) హత్య కేసులో కీలక విషయాలు..

Ankita murder case: రిసార్ట్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం జరిగేదని వెల్లడించిన మాజీ ఉద్యోగి

రిషికేశ్: ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల రెసెప్షనిస్ట్ అంకిత భండారి (Ankita Bhandari) హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. రిసార్ట్‌లోకి వీఐపీలతో పాటు అమ్మాయిలను తీసుకువచ్చేవారని రిషికేశ్‌లోని వనన్‌తార రిసార్ట్ మాజీ ఉద్యోగిని ఒకరు సంచలన విషయం వెల్లడించారు. అంకిత బండారి హత్య కేసులో నిందితులైన అంకిత్ గుప్తా, పుల్‌కిత్ ఆర్య రిసార్ట్‌కు వచ్చే అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించేవారని ఒక ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆమె తెలిపింది.


''రిషికేశ్‌లోని వనన్‌తార రిసార్ట్‌లో మేలో చేరాను. జూలైలోనే ఉద్యోగం విడిచిపెట్టాను. అంకిత్ గుప్తా (నిందితుడు), పుల్‌కిత్ ఆర్య (ప్రధాన నిందితుడు)లు రిసార్ట్‌కు వచ్చే అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించే వారు. అసభ్యంగా మాట్లాడేవారు. అమ్మాయిలను వాళ్లే తెచ్చేవారు. వీపీఐలు కూడా అక్కడకు వచ్చేవారు'' అని మాజీ ఉద్యోగిని తెలిపారు.


ఉత్తరాఖండ్‌లోని ఒక కెనాల్‌లో అంకిత భండారి మృతదేహం కనిపించడం ఇటీవల సంచలనమైంది. దీనికి ముందు ఆమె 5 రోజుల పాటు కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 'మునిగిపోవడం' (Drowning) వల్లే ఆమె మరణించినట్టు పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదకలో వెల్లడైంది. అయితే, దీనికి ముందే ఆమె ఒంటికి గాయాలయినట్టు తెలిపింది. బీజేపీ నేత కుమారుడు, రిసార్ట్ యజామాని ఫుల్‌కిత్ ఆర్య ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రూ.10,000 చెల్లించే రిసార్ట్ గెస్ట్‌లకు ''ప్రత్యేక సేవలు'' అందించేందుకు అంకిత నిరాకరించడంతోనే ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు మొదట్లో తెలిపారు.

Updated Date - 2022-09-27T22:30:59+05:30 IST