Uttarkhand: అంకిత భండారి మరణానికి కారణమిదే...ప్రాథమిక నివేదిక వెల్లడి

ABN , First Publish Date - 2022-09-25T20:38:12+05:30 IST

ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారి ) డ్రౌనింగ్ రణంగానే..

Uttarkhand: అంకిత భండారి మరణానికి కారణమిదే...ప్రాథమిక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారి (Ankita Bhandari) డ్రౌనింగ్ (Drowning) కారణంగానే చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. మృతికి ముందే ఒంటిపై గాయాలు అయినట్టు కూడా నివేదిక తెలిపింది. అయితే మునక (Drowing) కారణంగానే ఆమె మరణించినట్టు ధ్రువీకరించింది. రిషీకేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఈ ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఎయిమ్స్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఈ పోస్ట్‌మార్టం నిర్వహించింది. గాయాల వివరాలు, పోస్ట్‌మార్టంలో వెలికిచూసిన విషయాలను తుది నివేదకలో తెలియజేస్తామని ముసాయిదా నివేదక పేర్కొంది.


అంత్యక్రియలకు అంకిత కుటుంబం నిరాకరణ

కాగా, పోస్ట్‌మార్టం తుది నివేదక తమకు అందేంత వరకూ అంకిత అంత్యక్రియులు జరిపేది లేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదకతో తాను సంతృప్తిగా లేనని, తుది నివేదక వచ్చేంత వరకూ అంత్యక్రియలు జరపమని అంకిత తండ్రి వీరేంద్ర సింగ్ భండారి తెలిపారు. ప్రాథమిక నివేదికలో అసల వివరాలు ఏవీ లేవని అంకిత సోదరుడు అజయ్ సింగ్ భండారి అన్నారు. అంకిత పనిచేస్తున్న రిసార్ట్‌ను ఎందుకు కూల్చవేశారని ఆయన నిలదీశారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నంగానే దీనిని ఆయన తప్పుపట్టారు.


అంకిత భండారీ మృతదేహం రిషీకేష్‌లోని ఒక కెనాల్‌లో కనిపించడం సంచలనమైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యను, అత‌నికి స‌హ‌క‌రించిన రిసార్టు మేనేజ‌ర్‌ను, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ను పోలీసులు ఇప్పటికే  అరెస్టు చేశారు. ప్రత్యేక సేవల కింద గెస్టులకు ఉపచర్యలు చేసేందుకు అంకిత నిరాకరించదన్న కారణంగానే ఈ దురాగతానికి పాల్పడ్డారనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి.


సిబ్బందిని ప్రశ్నించనున్న సిట్

కాగా, వనతార రిసార్ట్‌ ఉద్యోగులందరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపనున్నట్టు ప్రత్యేక విచారణ బృందం (SIT) తెలిపింది. ఉద్యోగుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేస్తామని సిట్ ఇన్‌చార్జి డీఐజీ పీఆర్ దేవి తెలిపారు. రిసార్ట్ పూర్వాపరాలను కూపీ లాగుతున్నట్టు చెప్పారు. అంకిత ఫోన్‌ నుంచి వాట్సాప్ సంభాషణలను రికవర్ చేశామని, ఆ కోణం నుంచి కూడా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

Updated Date - 2022-09-25T20:38:12+05:30 IST