Online రమ్మీ నిషేధంపై ప్రత్యేక చట్టం చేయరా?

ABN , First Publish Date - 2022-07-10T14:40:17+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై ప్రత్యేక చట్టం చేయరా? అంటూ పీఎంకే అధ్యక్షుడు డా. అన్బుమణి రాందాస్‌ రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు

Online రమ్మీ నిషేధంపై ప్రత్యేక చట్టం చేయరా?

                                 - Pmk అధ్యక్షుడు అన్బుమణి


పెరంబూర్‌(చెన్నై), జూలై 9: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై ప్రత్యేక చట్టం చేయరా? అంటూ పీఎంకే అధ్యక్షుడు డా. అన్బుమణి రాందాస్‌ రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో 11 నెలల కాలంలో ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసలై 25 మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈక్రీడపై నిషేధం విధించాలని ఆరు నెలల క్రితమే తాము డిమాండ్‌ చేశామన్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ క్రీడను నిషేధిస్తూ ప్రత్యేక చట్టం చేశారా? లేదా? చట్టం చేసి ఉంటే దానిని గవర్నర్‌ ఆమోదానికి పంపారా? లేదా? అనే విషయాన్ని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ పర్యవసానాలపై రాష్ట్రప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఏమైంది? ఒకవేళ ప్రత్యేక చట్టం చేయకపోతే, సత్వరం ప్రత్యేక సమావేశం నిర్వహించి చట్టం చేయాలని అన్బుమణి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-07-10T14:40:17+05:30 IST