Amit Shah: వైష్ణోదేవి ఆలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి పూజలు

ABN , First Publish Date - 2022-10-04T17:19:52+05:30 IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయంలో(Vaishno DeviTemple) పూజలు చేశారు ...

Amit Shah: వైష్ణోదేవి ఆలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి పూజలు

జమ్మూ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా మంగళవారం శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయంలో(Vaishno DeviTemple) పూజలు చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెంటరాగా అమిత్ షా(AmitShah) హెలికాప్టరులో సంజిచట్టు వద్ద దిగి శ్రీమాత వైష్ణో దేవి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు(Offers Prayers) చేశారు. అమిత్ షా వైష్ణోదేవి మాతకు హారతి ఇచ్చారు. పూజల అనంతరం రాజౌరీ బహిరంగసభలో ప్రసంగించారు.జమ్మూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. రఘునాథ్ దేవాలయంలోనూ అమిత్ షా పూజలు జరిపారు.అనంతరం జమ్మూకశ్మీరులో శాంతిభద్రతల పరిస్థితిపై హోంశాఖ మంత్రి సమీక్షించారు.

Read more