అమెజాన్‌ ఆన్‌లైన్‌ అకాడమీ మూత!

ABN , First Publish Date - 2022-11-25T04:01:00+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ల సమయంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆన్‌లైన్‌ శిక్షణ వేదిక ‘అమెజాన్‌ అకాడమీ ప్లాట్‌ఫామ్‌’ను మూసివేయనున్నట్టు

అమెజాన్‌ ఆన్‌లైన్‌ అకాడమీ మూత!

బెంగళూరు, నవంబరు 24: కరోనా లాక్‌డౌన్‌ల సమయంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆన్‌లైన్‌ శిక్షణ వేదిక ‘అమెజాన్‌ అకాడమీ ప్లాట్‌ఫామ్‌’ను మూసివేయనున్నట్టు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మూసివేత ప్రక్రియను దశలవారీగా చేపట్టనున్నట్టు తెలిపింది. లాక్‌డౌన్ల సమయంలో దేశంలోని విద్యార్థుల కోసం వర్చువల్‌ శిక్షణను అమెజాన్‌ ప్రారంభించింది. జేఈఈ సహా అనేక పోటీ పరీక్షలపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ కొనసాగిస్తోంది. విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు యథావిధిగా తెరుచుకున్న నేపథ్యంలో అమెజాన్‌ తాజా ప్రకటన చేసింది.

Updated Date - 2022-11-25T04:01:00+05:30 IST

Read more