Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్

ABN , First Publish Date - 2022-05-19T01:16:57+05:30 IST

అమర్‌నాథ్ (Amarnath) యాత్రికుల భద్రత కోసం రేడియో

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్

న్యూఢిల్లీ : అమర్‌నాథ్ (Amarnath) యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్స్‌ను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వంలో జరిగిన  హైలెవెల్ సెక్యూరిటీ రివ్యూలో నిర్ణయించారు. ట్యాగ్స్, రీడర్స్‌ను ఉపయోగించి యాత్రికులను వైర్‌లెస్ విధానంలో నిరంతరం గమనించాలని నిర్ణయించారు. 


ఆర్ఎఫ్ఐడీ అంటే Radio Frequency Identification. ఇది ట్యాగ్స్, రీడర్స్‌తో కూడిన వైర్‌లెస్ ట్రాకింగ్ సిస్టమ్. చేతితో పట్టుకెళ్లగలిగిన లేదా స్తంభాలు, భవనాల వంటి స్థిరంగా ఉండేవాటికి అమర్చగలిగిన పరికరాలను దీనిలో ఉపయోగిస్తారు. వీటికి సమీపంలో ఉండే వస్తువులు లేదా వ్యక్తుల సమాచారాన్ని, గుర్తింపును తెలియజేసేందుకు రేడియో తరంగాలను వాడతారు. ఈ ట్యాగ్స్ గోప్యంగా సంకేత భాషలో సమాచారాన్ని తీసుకెళ్తాయి. అదేవిధంగా సీరియల్ నంబర్స్, క్లుప్తమైన వివరణలను తీసుకెళ్తాయి. వైమానిక పరిశ్రమల్లో ఉపయోగించే హై మెమరీ ట్యాగ్స్‌ను కూడా ఉపయోగిస్తారు. 


రీడర్‌తో రేడియో తరంగాలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, యాంటెన్నాలను ఈ ట్యాగ్స్ ఉపయోగించుకుంటాయి. లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించుకుంటాయి. ఈ ట్యాగ్స్ తిరిగి పంపించే రేడియో తరంగాలను హోస్ట్ కంప్యూటర్ విశ్లేషిస్తుంది. వస్తువులను, వ్యక్తులను గుర్తించడానికి ఆర్ఎఫ్ఐడీలకు నేరుగా కనిపించనక్కర్లేదు. 


RFIDలను ప్రతి చోట వాడవచ్చు. రిటెయిల్ వ్యాపారులు తమ వస్తువుల జాడను గుర్తించేందుకు వీటిని వాడతారు. ప్రయోగశాలల్లో తాళాలు,  క్రెడిట్ కార్డులు, గ్రంథాలయంలోని పుస్తకాలు వంటివాటికి కూడా ఉపయోగిస్తారు. 


సాధారణంగా ఈ ట్యాగ్స్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. అయితే హ్యాకర్లు సైడ్ చానల్ అటాక్స్ ద్వారా సమాచారాన్ని రాబట్టడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ట్యాగ్ మాన్యుఫ్యాక్చరర్లు ఎప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉంటారు. 


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రతి అమర్‌నాథ్ యాత్రికునికి RFID కార్డ్ ఇస్తారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బీమా చేస్తారు. యాత్ర మార్గంలో టెంట్ సిటీ, వైఫై హాట్‌స్పాట్స్, సరైన లైటింగ్ సదుపాయాలను కల్పిస్తారు. 


Updated Date - 2022-05-19T01:16:57+05:30 IST