‘జోడో’లో రాహుల్‌కు తోడుగా

ABN , First Publish Date - 2022-09-27T07:40:55+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’కు యవత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

‘జోడో’లో రాహుల్‌కు తోడుగా

తరలివస్తున్న యువత

పాలక్కడ్‌, సెప్టెంబరు 26: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’కు యవత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సోమవారం కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. రాహుల్‌ను చూసేందుకు, ఆయనతో కలిసి నడిచేందుకు వేలాది మంది యువతీ, యువకులు ఉత్సాహం చూపుతున్నారు. యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఇచ్చేందుకే రాహుల్‌ యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. కాగా, సోమవారం నాటికి జోడోయాత్ర 19 రోజులు పూర్తి చేసుకుంది. 

Read more