UP: ఆర్కియాలజీ సర్వేపై మధుర కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2022-08-29T23:20:25+05:30 IST

కృష్ణ జన్మభూమి, షాహి ఈద్గా (Krishna janmabhoomi And Shahi Idgah) కాంప్లెక్స్‌లో భారత పురావస్తు పరిశోధనా శాఖ..

UP: ఆర్కియాలజీ సర్వేపై మధుర కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు

అలహాబాద్: కృష్ణ జన్మభూమి, షాహి ఈద్గా (Krishna janmabhoomi And Shahi Idgah) కాంప్లెక్స్‌లో భారత పురావస్తు పరిశోధనా శాఖ (ASI) సర్వే జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు (Alahabad Highcourt) సోమవారంనాడు మధుర కోర్టుకు (Mathura court) ఆదేశాలిచ్చింది. పిటిషనర్ కోరిన విధంగా ఏఎస్ఐ సర్వే‌పై నాలుగు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదిశించింది. భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్‌మాన్ మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పీయూష్ అగర్వాల్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.


కృష్ణ జన్మభూమి, షాహి ఈద్గా వివాదాస్పద కాంప్లెక్‌‌లో గతంలో ఆలయం ఉండేదని, దానిని కూల్చివేసి షాహి ఈద్గా కట్టారని పిటిషనర్ల వాదనగా ఉంది. ద్వాపరయుగంలో కృష్ణుని తల్లిదండ్రులను కంసుడు ఇక్కడే జైలులో ఉంచాడని, ఇది కృష్ణుడు పుట్టిన స్థలమనీ, ఆ ప్రదేశంలోనే ఇప్పుడు మసీదు ఉందని వారు తమ దరఖాస్తులో పేర్కొన్నారు. వివాదాస్పద కాంప్లెక్స్‌లో ఏఎస్ఐ సర్వే చేయాలని కోరుతూ మధుర కోర్టు ముందు తాము వేసిన పిటిషన్‌పై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా చూడాలని అలహాబాద్ హైకోర్టును పిటిషనర్లు కోరారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని మధుర కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Updated Date - 2022-08-29T23:20:25+05:30 IST