Al Qaeda leader: యూఎస్ డ్రోన్ దాడిలో అల్‌ఖైదా నేత జవహరి హతం

ABN , First Publish Date - 2022-08-02T12:42:20+05:30 IST

అల్ ఖైదా కీలక నాయకుడు(Al Qaeda leader) ఐమాన్ అల్ జవహరి(Ayman al-Zawahiri)....

Al Qaeda leader: యూఎస్ డ్రోన్ దాడిలో అల్‌ఖైదా నేత జవహరి హతం

వాషింగ్టన్ (అమెరికా): అల్ ఖైదా కీలక నాయకుడు(Al Qaeda leader) ఐమాన్ అల్ జవహరీ(Ayman al-Zawahiri) అమెరికా డ్రోన్ దాడిలో (drone strike)హతమయ్యాడు. అఫ్ఘనిస్థాన్(Afghanistan) దేశంలో యూఎస్ ఆర్మీ జరిపిన డ్రోన్ దాడిలో ఉగ్రవాద సంస్థ కీలకనేత జవహరీ మరణించాడని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. 2011వ సంవత్సరంలో అల్ ఖైదా(Al Qaeda) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్(Osama bin Laden) హత్య తర్వాత ఉగ్రవాద సంస్థ అగ్రనేత జవహరీని యూఎస్ హతమార్చింది. 



ఉగ్రవాద కీలక నేత, ఈజిప్టియన్ సర్జన్ అయిన జవహరీ తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించారు. 3వేల మందిని హతమార్చిన 2011 సెప్టెంబరు 11 దాడికి జవహిరి సమన్వయం చేశారు. అఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలో ఆదివారం ఉదయం 6.18 గంటలకు యూఎస్ డ్రోన్ దాడిలో జవహరీ హతమయ్యాడని యూఎస్ అధికారులు చెప్పారు. 




కొవిడ్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో అల్ ఖైదా నేత జవహరీ హతమయ్యాడని ప్రకటించారు. జవహరీ హతంతో న్యాయం జరిగిందని జో బిడెన్ చెప్పారు. తన ఆదేశాల మేర యూఎస్ ఆర్మీ అప్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంపై జరిపిన వాయుసేన దాడి విజయవంతమై అల్ ఖైదా నేత జవహరీ హతమయ్యాడని బిడెన్ వివరించారు.

Updated Date - 2022-08-02T12:42:20+05:30 IST