రెండేళ్ల తర్వాత దేశం వెలుపలికి జిన్‌పింగ్‌

ABN , First Publish Date - 2022-09-13T10:13:40+05:30 IST

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ రెండేళ్లలో తొలిసారిగా దేశాన్ని విడిచి బయటకు రానున్నారు.

రెండేళ్ల తర్వాత దేశం వెలుపలికి జిన్‌పింగ్‌

ఎస్‌సీఓ సదస్సుకు హాజరు కానున్న చైనా అధ్యక్షుడు.. 

బీజింగ్‌, సెప్టెంబరు 12: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ రెండేళ్లలో తొలిసారిగా దేశాన్ని విడిచి బయటకు రానున్నారు. బుధవారం నుంచి ఈ నెల 16 వరకూ ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎ్‌ససీఓ) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారని చైనా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన కజకిస్థాన్‌లోనూ పర్యటిస్తారని పేర్కొంది. జిన్‌పింగ్‌ చివరిగా 2020 జనవరిలో మయన్మార్‌లో పర్యటించారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచంపై విరుచుకుపడటంతో ఆయన మరే దేశ పర్యటనకూ వెళ్లలేదు. 

Read more