Shanghaiలో కొత్త కొవిడ్-19 ఒమైక్రాన్ సబ్‌వేరియెంట్

ABN , First Publish Date - 2022-07-11T15:47:12+05:30 IST

చైనా దేశంలోని షాంఘై నగరంలో తాజాగా కొవిడ్ -19 ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వెలుగుచూసింది...

Shanghaiలో కొత్త కొవిడ్-19 ఒమైక్రాన్ సబ్‌వేరియెంట్

షాంఘై (చైనా): చైనా దేశంలోని షాంఘై నగరంలో తాజాగా కొవిడ్ -19 ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వెలుగుచూసింది.చైనా దేశంలో నెలల తరబడి కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత షాంఘై నగరంలో కొత్త కొవిడ్-19 ఓమైక్రాన్ సబ్‌వేరియంట్‌ను వైద్యాధికారులు గుర్తించడం సంచలనం రేపింది. జులై 8వతేదీన పుడాంగ్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కనుగొన్న ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియంట్ కేసుతో చైనా వైద్యులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన ఈ కొత్త కొవిడ్ వేరియంట్ కేసును వైద్యాధికారులు పరిశీలిస్తున్నారని నగర ఆరోగ్య కమిషన్ వైస్ డైరెక్టర్ జావో దండన్ తెలిపారు.తూర్పు చైనాలోని షాంఘై నగరంలో కొవిడ్ కేసుల సంఖ్య పెంపుతో జూన్ ప్రారంభంలో దాదాపు రెండు నెలలపాలు లాక్‌డౌన్ విధించారు. భవనాలను లాక్ చేస్తూ కఠినమైన పరిమితులను విధించారు.


‘‘మా షాంఘై నగరంలో ఇటీవల సంక్రమించిన మరిన్ని కొవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళన కలిగించాయి, సమాజంలో కరోనా అంటువ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది’’ అని షాంఘై ఆరోగ్య కమిషన్ జావో హెచ్చరించారు.షాంఘై జిల్లాల్లోని నివాసితులు జులై 12-14 వరకు రెండు రౌండ్ల కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, కొత్త వేరియంట్ వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని జాబో పేర్కొన్నారు. ఒమైక్రాన్ (Omicron) బీఏ.5 వేరియంట్ మొదటిసారిగా మే 13వతేదీన చైనాలో కనుగొన్నారు. 


విదేశాలలో కొత్త కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌లను ప్రేరేపిస్తున్న ఒమైక్రాన్ (Omicron) బీఏ.5 చైనా సెంటర్ ప్రకారం, ఉగాండా నుంచి షాంఘైకి వచ్చిన 37 ఏళ్ల  రోగిలో మే 13న మొదటిసారిగా గుర్తించారు. ఒమైక్రాన్ వేరియంట్ బీఎ.5 వేగవంతమైన ప్రసార రేటు ఉందని వైద్యులు చెప్పారు. తీవ్రమైన అనారోగ్యం లేదా మరణాన్ని కలిగించకుండా ఒమైక్రాన్ బీఎ.5ను నిరోధించడంలో కొవిడ్ టీకా ఇప్పటికీ ప్రభావవంతంగా ఉంటుందని నగర నిపుణుల సలహా బృందం సభ్యుడు యువాన్ జెంగాన్ చెప్పారు. 


Updated Date - 2022-07-11T15:47:12+05:30 IST