Cyber crime : 105 చోట్ల సీబీఐ దాడులు

ABN , First Publish Date - 2022-10-05T02:02:06+05:30 IST

ఆర్థిక నేరాల్లో ప్రమేయంగల సైబర్ క్రిమినల్స్‌పై

Cyber crime : 105 చోట్ల సీబీఐ దాడులు

న్యూఢిల్లీ : ఆర్థిక నేరాల్లో ప్రమేయంగల సైబర్ క్రిమినల్స్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మంగళవారం విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా 105 చోట్ల దాడులు నిర్వహించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసుల సహాయంతో ఈ సోదాలను నిర్వహిస్తోంది. దీనికి ఆపరేషన్ చక్ర (Operation Chakra) అని పేరు పెట్టింది. 


విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, సీబీఐ అధికారులు 87 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. 18 చోట్ల స్థానిక పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 300 మంది అనుమానితులపై నిఘా పెట్టి, ఈ దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున డిజిటల్ సాక్ష్యాధారాలను, సుమారు రూ.1.5 కోట్ల నగదును, 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), రాయల్ కెనడియన్ మౌంటెయిన్ పోలీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్, ఇంటర్‌పోల్ అందజేసిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-10-05T02:02:06+05:30 IST