Adani: కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువ ఎదిగా!

ABN , First Publish Date - 2022-12-30T00:43:30+05:30 IST

వ్యాపారవేత్త గా బీజేపీ హయాంలోకన్నా కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువ ఎదిగానని ఆసియా లో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ చెప్పారు.

Adani: కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువ ఎదిగా!

రాజీవ్‌ నిర్ణయంతోనే వ్యాపారంలో తొలి అడుగు..

మోదీ వల్ల ప్రత్యేకంగా లబ్ధి పొందింది లేదు: అదానీ

న్యూఢిల్లీ, డిసెంబరు 29: వ్యాపారవేత్త గా బీజేపీ హయాంలోకన్నా కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువ ఎదిగానని ఆసియా లో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ చెప్పారు. ప్రధాని మోదీ తాను ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్లం కావ డం వల్ల తనను లక్ష్యంగా చేసుకొని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాజా గా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంట ర్వ్యూ ఇచ్చారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో ఎగుమతులు, దిగుమతుల విధానాన్ని సరళీకరించడం వల్ల తాను ఆ వ్యాపారంలోకి అడుగు పెట్టానని, నాడు రాజీవ్‌ ఆ నిర్ణయం తీసుకోకుంటే వ్యాపారవేత్తగా తన ప్రయాణం మొదలయ్యేదేకాదన్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలతో వ్యాపారవేత్తగా తన రెండోదశ మొదలైందని, నాటి సంస్కరణలతో లబ్ధి పొందిన ప్రస్తుత పారిశ్రామికవేత్తల్లో తా నూ ఒకడినన్నారు. 1995లో కేశూభాయ్‌ పటేల్‌ గుజరాత్‌ సీఎం అయ్యాక తన వ్యాపార ప్రయాణంలో మూడో అంకం మొదలైందని అదానీ చెప్పారు.

అప్పటిదాకా గుజరాత్‌ అభివృద్ధి ముంబై-ఢిల్లీ ప్రధాన రహదారి వెంటే జరిగిందని, కేశూభాయ్‌ దార్శనికతతో మొత్తం గుజరాత్‌ తీరం అభివృద్ధి సాధించిందన్నారు. ఆయన నిర్ణయాలతో ముంద్రా పోర్టు నిర్మాణాన్ని తన కు అప్పగించారని, దీంతో తన ఎదుగుదలకు ఎదురులేకుండా పోయిందన్నారు. 2011లో అప్పటి సీఎం మోదీ ఆధ్వర్యంలో గుజరాత్‌ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు తెచ్చినప్పుడు తన వ్యాపార విస్తరణ నాలుగో దశలో అడుగు పెట్టిందన్నారు. ప్రభుత్వాల విధానాలతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నానే కానీ మోదీ నుంచి తనకు ప్రత్యేక లబ్ధి చేకూరిందేమీ లేదని తేల్చి చెప్పారు.

Updated Date - 2022-12-30T00:43:31+05:30 IST