మహా దళపతి బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-10-01T07:25:21+05:30 IST

భారత మహా దళపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎ్‌స)గా జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

మహా దళపతి బాధ్యతల స్వీకరణ

దేశానికి రెండో సీడీఎ్‌సగా అనిల్‌ చౌహాన్‌ 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: భారత మహా దళపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎ్‌స)గా జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దేశ రెండో సీడీఎ్‌సగా బాధ్యతలు చేపట్టిన ఆయన సైనిక వ్యవహారాల కార్యదర్శి గానూ, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌(సీవోఎ్‌ససీ)కి శాశ్వత చైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జనరల్‌ చౌహాన్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారత సాయుధ బలగాల్లో అత్యున్నత ర్యాంక్‌ బాధ్యతలు స్వీకరించడం ఎంతో గర్వంగా ఉంది. త్రివిధ దళాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను. అన్ని రకాల ఇబ్బందులు, భద్రతా సవాళ్లను త్రివిధ దళాల ఉమ్మడి సహకారంతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’’ అని అన్నారు. అంతకుముందు ఇండియా గేట్‌ కాంప్లెక్స్‌లోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు. రైసినా హిల్స్‌ సౌత్‌ బ్లాక్‌లోని లాన్ల వద్ద ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, వాయుసేనాధిపతి చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, నేవీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ ఘోర్మడే సమక్షంలో త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం (గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌) స్వీకరించారు. దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను జనరల్‌ చౌహాన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. చౌహాన్‌ వెంట ఆయన సతీమణి అనుపమ కూడా ఉన్నారు. 

Read more