అబే అసాధారణ వ్యక్తి

ABN , First Publish Date - 2022-09-28T07:32:34+05:30 IST

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే (67) అసాధారణ వ్యక్తి అని.. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం సుభద్రంగా, స్వేచ్ఛావాణిజ్యంతో విరాజిల్లాలని కాంక్షించారని ప్రధాని మోదీ కొనియాడారు.

అబే అసాధారణ వ్యక్తి

జపాన్‌ మాజీ ప్రధాని అంత్యక్రియలకు హాజరైన ప్రధాని మోదీ

టోక్యో, సెప్టెంబరు 27: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే (67) అసాధారణ వ్యక్తి అని.. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం సుభద్రంగా, స్వేచ్ఛావాణిజ్యంతో విరాజిల్లాలని కాంక్షించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ ఏడాది జూలై 8న జపాన్‌లోని నారా ప్రాంతంలో ప్రచారం చేస్తున్న అబేను ఓ దుండగుడు హత్యచేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన అధికారిక అంత్యక్రియలు టోక్యోలోని నిప్పోన్‌ బుడొకన్‌లో జరిగాయి. మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సహా వందకు పైగా దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.   

Read more