ఆప్‌ ప్రచార సమితి అధ్యక్షుడిగా ‘ముఖ్యమంత్రి చంద్రు’

ABN , First Publish Date - 2022-07-05T16:29:27+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే ఆమ్‌ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే ‘ముఖ్యమంత్రి చంద్రు’ ఆప్‌ ప్రచార సమితి

ఆప్‌ ప్రచార సమితి అధ్యక్షుడిగా ‘ముఖ్యమంత్రి చంద్రు’

బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే ఆమ్‌ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే ‘ముఖ్యమంత్రి చంద్రు’ ఆప్‌ ప్రచార సమితి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ దిలీప్‏పాండే సూచన మేరకు ‘ముఖ్యమంత్రి చంద్రు’కు నగరంలో సోమవారం అధికారికంగా నియామక లేఖను అందచేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్విరెడ్డి మాట్లాడుతూ కన్నడభాషపై ఎనలేని మమకారంతోపాటు చక్కటి వాక్చాతుర్యం కల్గిన చంద్రు ఆప్‌ ప్రచార సమితి అధ్యక్షుడిగా రానున్న రోజుల్లో కీలకపాత్ర పోషించడం తథ్యమన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చంద్రు ప్రకటించారు. 

Read more