సీఎం సీట్లో మహాకాళేశ్వరుడి చిత్ర పటం

ABN , First Publish Date - 2022-09-29T09:04:43+05:30 IST

మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశంలో మహాకాళేశ్వరుడి చిత్ర పటాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సీఎం సీట్లో మహాకాళేశ్వరుడి చిత్ర పటం

  మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశంలో మహాకాళేశ్వరుడి చిత్ర పటాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.  మొదటిసారిగా ఉజ్జెయినీలో క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కుర్చీలో మహాకాళేశ్వరుడి భారీ చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. ఇరువైపులా సీఎం, రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, మంత్రులు కూర్చున్నారు. ఈ పరిణామంపై  మాజీ బ్యూరోకాట్లు స్పందిస్తూ దేవుడు అన్ని చోట్లా ఉంటాడని, ప్రభుత్వంలో, పాలనలో ప్రత్యేకంగా చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 

Read more