ముంబైలో తట్టుతో ఏడాది చిన్నారి మృతి!

ABN , First Publish Date - 2022-11-30T02:45:44+05:30 IST

తట్టు వ్యాధి ముంబై నగరాన్ని వణకిస్తోంది. రెండు నెలలుగా రాష్ట్రంలో ఈ వ్యాధి విజృంభిస్తోంది.

ముంబైలో తట్టుతో ఏడాది చిన్నారి మృతి!

కొత్తగా 11 కేసులు, మొత్తం కేసుల సంఖ్య 303

ముంబై, నవంబరు 29: తట్టు వ్యాధి ముంబై నగరాన్ని వణకిస్తోంది. రెండు నెలలుగా రాష్ట్రంలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల తట్టుతో పది మంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో తట్టుతో ఓ ఏడాది చిన్నారి మృతి చెందింది. అంఽధేరిలోని ఏడాది వయసున్న ఓ పాప సోమవారం చనిపోయిందని, తట్టు వ్యాధితో శనివారం ఆ పాప కస్తూర్బా ఆస్పత్రిలో చేరిందని అధికారులు తెలిపారు. కొత్తగా మరో 11 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 303కు చేరింది.

Updated Date - 2022-11-30T02:45:44+05:30 IST

Read more