ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న కేంద్రం

ABN , First Publish Date - 2022-06-07T08:31:10+05:30 IST

ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయనున్న కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 6: ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం తొలుత 250 జిల్లాలను గుర్తించామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖల మంత్రి వీరేం ద్ర కుమార్‌ వెల్లడించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థల సాయంతో వాటిని నిర్వహిస్తామన్నారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలను సోమవారం ఆయన ఇక్కడ విలేకరులకు వివరిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలయిందని చెప్పారు. ఎస్‌.సి. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఉపకార వేతనాలను జమ చేస్తున్నామని, దీనివల్ల 41 లక్షల మంది లబ్ధిపొందారని వివరించారు. సీనియర్‌ సిటిజన్ల ఉపాధి కోసం సీనియర్‌ ఏబుల్‌ సిటిజన్స్‌ ఫర్‌ రీ ఎంప్లాయిమెంట్‌ ఇన్‌ డిగ్నిటీ(సేక్రెడ్‌) పేరుతో పోర్టల్‌ను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. ఈ విషయమై తొమ్మిది స్టార్టప్‌ కంపెనీలు కూడా పనిచేస్తున్నట్టు తెలిపారు. మాదక ద్రవ్యాల బెడద నివారణకు నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. 

Read more