DMK: 7న డీఎంకే అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2022-10-01T14:40:44+05:30 IST

అధికార డీఎంకే(DMK) అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి అక్టోబరు ఏడు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్య

DMK: 7న డీఎంకే అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 30: అధికార డీఎంకే(DMK) అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి అక్టోబరు ఏడు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) ప్రకటించారు. డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో కొత్తగా ఎంపికైన సభ్యులతో సర్వసభ్య మండలి సమావేశం అక్టోబరు 9వ తేది ఆదివారం ఉదయం అమింజికరై సెయింట్‌ జార్జి పాఠశాల ప్రాంగణంలోని లింగ్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతుందని ఆయన తెలిపారు. డీఎంకే అధ్యక్ష,, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ 7వ తేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో జరుగుతుందన్నారు. కాగా, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకుు పోటీచేయదలచుకున్న వారు దరఖాస్తు ఫీజుగా రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుందని, పార్టీ పదవులకు పోటీచేయదలచుకున్న వారు పార్టీ ఎన్నికల విధివిధానాలు విధిగా పాటించాలని ఆయన తెలిపారు. కాగా, డీఎంకే సర్వసభ్యమండలిలో పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మళ్లీ ఎంపిక చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశాలు మెండుగా ఉన్నాయనిపార్టీ సీనియర్లు చెబుతున్నారు.

Updated Date - 2022-10-01T14:40:44+05:30 IST