లోయలో పడిన టెంపో.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2022-09-26T16:36:30+05:30 IST

కులు (Kulu)లోని బంజర్ వ్యాలీ‌ (Banjar Valley)లో నిన్న అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

లోయలో పడిన టెంపో.. ఏడుగురు మృతి

Himachalpradesh : కులు (Kulu)లోని బంజర్ వ్యాలీ‌ (Banjar Valley)లో నిన్న అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న టెంపో కొండపై నుంచి లోయలో పడిపోయిన ప్రమాదంలో 7గురు మృతి చెందారు. మరో పదిమంది క్షతగాత్రులకు వైద్యులు హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారు. బంజర్ సబ్‌డివిజన్‌లోని ఘియాఘి సమీపంలో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న బంజర్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ శౌరీ (BJP MLA Surender Souri) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో అంటే అర్ధరాత్రి 12.45 గంటలకు ఫేస్‌బుక్ లైవ్‌ (Facebook Live)లో ఘటనకు సంబంధించిన వీడియోను ప్రసారం చేశారు. క్షతగాత్రులను మొదట బంజర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం కులు ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. బాధితులు రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madyapradesh), హర్యానా (Haryana), ఢిల్లీ (Delhi) సహా వివిధ రాష్ట్రాల వాసులుగా గుర్తించనట్టు సురేందర్ శౌరీ తెలిపారు. ప్రమాదం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read more