ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసిన 74 మందికి 18ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2022-06-23T21:04:59+05:30 IST

ఆహారం-ఔషధాల కొరత, ఆర్థిక అస్థిరత్వం నేపథ్యంలో స్వేచ్ఛ కావాలంటూ గతేడాది జూలై 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. 1959 తర్వాత క్యూబాలో జరిగిన అతిపెద్ద నిరసన ఇదే. ఈ నిరసన అనంతరం గతేడాది 1,300 మందిని

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసిన 74 మందికి 18ఏళ్ల జైలు

హవానా: గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టినందుకు గాను తాజాగా మరో 74 మందికి క్యూబా కోర్టులు 18 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాయని స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఏడాది కాలంగా వరుస విచారణలతో నిరసనల్లో పాల్గొన్న వారికి శిక్షలు విధిస్తూ వస్తున్నారు. ఇందులో 56 మందికి 10-18 ఏళ్లపాటు జైలు శిక్ష పడింది. మిగతా వారికి 18 మందికి (ఇందులో 12 మంది టీనేజర్లు) కార్మిక దిద్దుబాటు చర్య కిందకు శిక్ష మార్చారు. ఈ నిరసనలు క్యూబా కోర్టులు రాజ్యాంగం, సోషలిజంపై దాడిగా పరిగణించాయి.


ఆహారం-ఔషధాల కొరత, ఆర్థిక అస్థిరత్వం నేపథ్యంలో స్వేచ్ఛ కావాలంటూ గతేడాది జూలై 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. 1959 తర్వాత క్యూబాలో జరిగిన అతిపెద్ద నిరసన ఇదే. ఈ నిరసన అనంతరం గతేడాది 1,300 మందిని నిర్బంధించారు. గతేడాది కోర్టు విచారణలో ఉన్న కొంత మందికి 25 ఏళ్లు జైలు శిక్ష విధించారు. తాజా 74 మందితో కలిపి మొత్తంగా 488 మందికి జైలు శిక్ష విధించారు. కాగా, ఈ నిరసనల వెనుక అమెరికా హస్తం ఉందని క్యూబా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Updated Date - 2022-06-23T21:04:59+05:30 IST