నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలి.. ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2022-07-15T22:36:09+05:30 IST

దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడౌన్ (Godown) గోడ కూలి ఐదుగురు

నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలి.. ఐదుగురి మృతి

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడౌన్ (Godown) గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. మరో 9మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం రాజా హరీష్ చంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvidnd Kejriwal) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు చెప్పారు. సహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీ పైర్ బ్రిగేడ్, పోలీసులు అధికారులతోపాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి.  

Read more