Train Services: 27 నుంచి అరక్కోణం-కడప ప్యాసింజర్‌ రైలు

ABN , First Publish Date - 2022-07-23T15:51:24+05:30 IST

అరక్కోణం-కడప-అరక్కోణం ప్యాసింజర్‌ రైలు సేవలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, నెం.06401

Train Services: 27 నుంచి అరక్కోణం-కడప ప్యాసింజర్‌ రైలు

పెరంబూర్‌(చెన్నై), జూలై 22: అరక్కోణం-కడప-అరక్కోణం ప్యాసింజర్‌ రైలు సేవలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, నెం.06401 అరక్కోణం-కడప మెమూ రైలు ఉదయం 7.05 గంటలకు అరక్కోణంలో బయల్దేరి 11.45 గంటలకు కడప చేరుకుంటుంది. అలాగే, నెం.06402 కడప-అరక్కోణం మెమూ రైలు మధ్యాహ్నం 3.10 గంటలకు కడపలో బయల్దేరి సాయంత్రం 6.35 గంటలకు అరక్కోణం చేరుకుంటుందని దక్షిణ రైల్వే తెలియజేసింది.

Updated Date - 2022-07-23T15:51:24+05:30 IST