China Bus Crash: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి

ABN , First Publish Date - 2022-09-18T21:22:19+05:30 IST

పొరుగుదేశం చైనా (china)లో ఈ ఏడాదిలోనే అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. నైరుతి చైనాలో

China Bus Crash: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి

బీజింగ్: పొరుగుదేశం చైనా (china)లో ఈ ఏడాదిలోనే అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. నైరుతి చైనాలో ఈ రోజు (ఆదివారం) జరిగిన ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మందితో ప్రయాణిస్తున్న వాహనం రూరల్ గుయిజౌ ప్రావిన్స్‌ (rural Guizhou province)లోని జాతీయ రహదారిపై ఒక్కసారిగా పల్టీలు కొట్టింది.


ఈ ఘటనలో 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయాన్ని పోలీసులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే, ఇంతకుమించిన వివరాలు వెల్లడించలేదు. 


చాలా వరకు పర్వతప్రాంతమైన గుయిజౌలోని కియాన్నన్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం పలు అల్పసంఖ్యాక వర్గాలకు నిలయం. ఇదే ప్రావిన్సులో ఈ ఏడాది జూన్‌లో ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మార్చిలో ఓ ప్యాసెంజర్ జెట్ విమానం కుప్పకూలిన ఘటనలో 132 మంది చనిపోయారు. చైనాలో కొన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే కాగా, తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదం ఈ ఏడాది జరిగిన అతిపెద్దదని అధికారులు తెలిపారు. 


నిజానికి చైనాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక, గుయిజౌ ప్రావిన్సులో రహదారి ప్రమాదాలు చాలా ఎక్కువ. అయితే, ఈ ఏడాది మాత్రం ఇదే పెద్ద అతిపెద్ద ప్రమాదం కావడం గమనార్హం.

Updated Date - 2022-09-18T21:22:19+05:30 IST