hijab ధరించినందుకు 24 studentsపై వారం వేటు

ABN , First Publish Date - 2022-06-07T22:54:11+05:30 IST

హిజాబ్ వేసుకొచ్చారని కొంత మంది విద్యార్థుల్ని పరీక్షకు హాజరు కాకుండా అడ్డుకోవడంతో లేచిన వివాదం ఇప్పటికీ రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. ఇది ముగియక ముందే ఇదే వరుసలో మరో ఘటన జరిగింది. హిజాబ్ వేసుకొచ్చారని 24 మంది విద్యార్థుల్ని తరగతులకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. వారిని వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు..

hijab ధరించినందుకు 24 studentsపై వారం వేటు

బెంగళూరు: హిజాబ్ వేసుకొచ్చారని కొంత మంది విద్యార్థుల్ని పరీక్షకు హాజరు కాకుండా అడ్డుకోవడంతో లేచిన వివాదం ఇప్పటికీ రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. ఇది ముగియక ముందే ఇదే వరుసలో మరో ఘటన జరిగింది. హిజాబ్ వేసుకొచ్చారని 24 మంది విద్యార్థుల్ని తరగతులకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. వారిని వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఉప్పినంగడిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం జరిగిందీ ఘటన. వాస్తవానికి హిజాబ్ వివాదం కారణంగా.. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు యూనిఫార్మ్ తప్పనిసరి చేశారు. అయినప్పటికీ విద్యార్థులు యూనిఫాంలో కాకుండా హిజాబ్‌లో వచ్చారని, అందుకే వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. హిజాబ్ వివాదం కారణంగా చాలా మంది విద్యార్థులు హాజాబ్ అనుమతి ఉన్న కాలేజీలకు మారిపోతున్నారని, పెద్ద ఎత్తున ట్రాన్స్‌పర్లు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు కూడా సహకరిస్తున్నాయట. హిజాబ్ ధరించేవారు టీసీ తీసుకొని వెళ్లొచ్చని కాలేజీలే చెప్తున్నాయని అంటున్నారు.

Updated Date - 2022-06-07T22:54:11+05:30 IST