కళ్లకు గంతలు కట్టుకొని సైకిల్‌పై 20 కి.మీ...!

ABN , First Publish Date - 2022-01-03T18:25:02+05:30 IST

మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కల్పించేలా, కళ్లకు గంతలు కట్టుకొని 20 కి.మీ దూరం సైకిల్‌ తొక్కి 11 ఏళ్ల బాలుడు రికార్డు నెలకొల్పాడు.

కళ్లకు గంతలు కట్టుకొని సైకిల్‌పై 20 కి.మీ...!

 11 ఏళ్ల బాలుడి సాధన

   చెన్నై/పెరంబూర్‌, జనవరి 2: మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కల్పించేలా, కళ్లకు గంతలు కట్టుకొని 20 కి.మీ దూరం సైకిల్‌ తొక్కి 11 ఏళ్ల బాలుడు రికార్డు నెలకొల్పాడు. సేలం మరవనేరి ప్రాంతానికి చెందిన కరాటే మాస్టర్‌ అరుళ్‌ మురుగన్‌ కుమారుడు చరణ్‌దేవ్‌ (11) 5వ తరగతి చదు వుతున్నాడు. మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కల్పించాలనే సంక ల్పంతో ఆదివారం కొండప్పనాయకన్‌పట్టి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ను సేలం నగర పోలీసు సహాయ కమిషనర్‌ మాడస్వామి ప్రారంభించారు. యాత్ర గోరిమేడు, అస్తంపట్టి, శారద కాలేజ్‌ రోడ్డు, తిరువకవుండనూర్‌, కురంగుచావిడి, ఐదు రోడ్ల జంక్షన్‌ మీదుగా మహాత్మాగాంధీ క్రీడా మైదానం వరకు 20 కి.మీ దూరాన్ని గంట 3 నిముషాల్లో చరణ్‌దేవ్‌ పూర్తిచేశాడు. బాలుడి సాధన గ్లోబల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదుచేసినట్లు నిర్వాహకులు సర్టిఫికెట్‌ అందజేసి ప్రశంసించారు.

Read more