బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-07-05T07:49:38+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు 200 అడుగుల లోయలో పడటంతో 13 మంది దుర్మరణం చెందారు.

బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

ఇద్దరికి తీవ్ర గాయాలు 

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


సిమ్లా/మనాలి, జూలై 4: హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు 200 అడుగుల లోయలో పడటంతో 13 మంది దుర్మరణం చెందారు. షెయిన్‌షేర్‌ నుంచి కులు వెళ్తున్న ప్రైవేటు బస్సు  జంగ్లా గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరగ్గా పలువురు పాఠశాల విద్యార్థులు సహా 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు సాయంగా రూ.15వేల చొప్పున ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ బాధితకుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

Read more