13 కోట్ల చొప్పున100 మంది ఖాతాల్లోకి ..

ABN , First Publish Date - 2022-05-30T09:53:38+05:30 IST

చెన్నై టి.నగర్‌లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాలలో పొరపాటున తలా రూ.13 కోట్ల మేరకు నగదు జమ అయింది.

13 కోట్ల చొప్పున100 మంది ఖాతాల్లోకి ..

చెన్నై టీ నగర్‌ హెచ్‌డీఎ్‌ఫసీ నిర్వాకం

చెన్నై, మే 29(ఆంధ్రజ్యోతి): చెన్నై టి.నగర్‌లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాలలో పొరపాటున తలా రూ.13 కోట్ల మేరకు నగదు జమ అయింది. అయితే వెంటనే ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు.. హడావుడిగా ఆ నగదును వెనక్కి తీసేసుకుని తప్పు సరిదిద్దుకున్నా రు. తమ ఖాతాలలో ఒకేసారి రూ.13 కోట్లు జమ అయినట్లు వచ్చిన ఎస్‌ఎంఎ్‌సలను చూసి ఆ ఖాతాదారులు ఆశ్చర్యపోయారు. స్థానిక టి.నగర్‌లోని ఆ బ్యాంక్‌లో ఇటీవల కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లో కొత్త మార్పులు చేపట్టారు. ఆ సందర్భంగా ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా వందమంది ఖాతాల్లో తలా రూ.13 కోట్ల మేరకు జమ అయ్యింది. ఈ విషయాన్ని కనుగొన్న బ్యాంక్‌ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-05-30T09:53:38+05:30 IST