Idol immersions: గోమతి, గంగా నదుల్లో 10 మంది గల్లంతు

ABN , First Publish Date - 2022-10-05T00:36:01+05:30 IST

పండుగల వేళ మంగళవారం దేవతా విగ్రహాల నిమజ్జనాల్లో డు చోట్ల 10 మంది వరకూ...

Idol immersions: గోమతి, గంగా నదుల్లో 10 మంది గల్లంతు

కాన్పూర్/లక్నో: పండుగల వేళ మంగళవారం దేవతా విగ్రహాల నిమజ్జనాల్లో (Idol immersions) రెండు చోట్ల 10 మంది వరకూ గల్లంతయ్యారు. యూపీ రాజధాని లక్నోలోని గోమతి నదిలో నిమజ్జనాలు జరుగుతుండగా నలుగురు యువకుల జాడ గల్లంతైంది. కాన్పూరులోని బిల్‌హౌర్‌లో నలుగురు అమ్మాయిలు నీటిలో మునిగిపోయారు. లక్నోలో యువకులు నిమిజ్జనం సందర్భంగా పడవ బాలెన్స్ తప్పి నీటిలో పడిపోయారని, కాన్పూరులో నిమజ్జనం జరుగుతుండగా కాలుజారి నదిలో నలుగురు అమ్మాయిలు మునిగిపోగా, వారిని కాపేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకుల జాడ గల్లంతైందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. రెండు ప్రాంతాల్లోనూ గజఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టినట్టు వారు చెప్పారు.

Updated Date - 2022-10-05T00:36:01+05:30 IST