హిమోత్పాతం.. యమపాశం

ABN , First Publish Date - 2022-10-05T09:44:15+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాకు చెందిన నెహ్రూ పర్వతారోహణ శిక్షణ కేంద్రానికి చెందిన 10 మంది మంచు పెళ్లలు విరిగిపడడంతో మృతిచెందారు. మరో 11 మంది గల్లంత య్యారు. ఎన్‌ఐఎంకు చెందిన 97 మంది

హిమోత్పాతం.. యమపాశం

10 మంది పర్వతారోహకుల దుర్మరణం

ఉత్తరకాశీలో ఘటన నెహ్రూ పర్వతారోహణ సంస్థ ఆధ్వర్యంలో..

10 రోజుల క్రితం శిఖరంపైకి 121 మంది వారిలో 97 మంది శిక్షణార్థులు 

మిగతా వారు శిక్షకులు ప్రాథమిక శిక్షణ ముగిశాక.. 

53 మంది మెరుగైన శిక్షణ కోసం అక్కడే బస

వాతావరణ హెచ్చరికలతో తిరుగు ప్రయాణం

ఒక్కసారిగా విరుచుకుపడ్డ హిమపాతం

చిక్కుకున్న 29 మంది.. 10 మంది మృతి

8 మందిని కాపాడిన సహాయక బృందాలు

పర్వతారోహకుల్లో ఇద్దరు తెలుగువారు?

ద్రౌపది దండా-2 శిఖరం వద్ద ఘటన


దెహ్రాదూన్‌, అక్టోబరు 4: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాకు చెందిన నెహ్రూ పర్వతారోహణ శిక్షణ కేంద్రానికి చెందిన 10 మంది మంచు పెళ్లలు విరిగిపడడంతో మృతిచెందారు. మరో 11 మంది గల్లంత య్యారు. ఎన్‌ఐఎంకు చెందిన 97 మంది ట్రైనీలు, 24 మంది శిక్షకులు ప్రాథమిక, అడ్వాన్స్‌ శిక్షణ కోసం గత నెల 22న హిమాలయాల్లోని ద్రౌపది దండా-2 శిఖరానికి చేరుకున్నారు. ఐదు రోజుల క్రితం ప్రాథమిక శిక్షణ ముగిశాక బేసిక్‌ కోర్స్‌ పర్వతారోహకులు తిరిగి రాగా.. 44 మంది ట్రైనీలు, 9 మంది శిక్షకులు అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ నిమిత్తం డోక్రానీ బమాక్‌ హిమనీనదం సమీపంలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో ఇద్దరు తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ కేంద్రం హెచ్చరికలతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా అదే సమయానికి మంచుపెళ్లలు విరిగిపడడంతో హిమోత్పాతం దూసుకువచ్చింది. అప్పటికే 24 మంది సురక్షిత ప్రదేశానికి చేరుకోగా.. 29 మంది మంచులో చిక్కుకుపోయారు. శిక్షకుల వద్ద ఉన్న శాటిలైట్‌ ఫోన్‌ సహాయంతో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ  (ఎస్‌డీఆర్‌ఎ్‌ఫ)కు సమాచారం అందించారు. రెండు హెలికాప్టర్లతో సైన్యం, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ బృందాలు రంగంలోకి దిగాయి. మంచులో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడాయి.  


ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు

పౌడీ, అక్టోబరు 4: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలోని బిరోన్‌ఖాల్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు లోయలోకి పడిపోయింది. బస్సులో 45 నుంచి 50 మంది ఉన్నారు. చీకట్లో పోలీసులు, స్థానికులు ఫ్లాష్‌ లైట్లు, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురు బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. 

Read more