త్వరలో ‘పోడు’కు పరిష్కారం: సత్యవతి

ABN , First Publish Date - 2022-09-11T09:28:33+05:30 IST

త్వరలో ‘పోడు’కు పరిష్కారం: సత్యవతి

త్వరలో ‘పోడు’కు పరిష్కారం: సత్యవతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలను వేధిస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. ఈ నెల 17న ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాల్ని సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై గిరిజన, బంజారా, ఆదివాసి సంఘాల నాయకులతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. 

Read more