తెలంగాణ సమైక్యత కాదు.. విలీనమే

ABN , First Publish Date - 2022-09-11T09:24:42+05:30 IST

తెలంగాణ సమైక్యత కాదు.. విలీనమే

తెలంగాణ సమైక్యత కాదు.. విలీనమే

సెప్టెంబరు 17పై కూనంనేని సాంబశివరావు


హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు 17ను తెలంగాణ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని గౌరవించాలన్నారు. సెప్టెంబరు 17ను విలీన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సాంబశివరావు శనివారం మగ్దూంభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని వివరించారు. ఆదివారం నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కూనంనేని తెలిపారు. మరోవైపు, సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా పాటించాలని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించడం సరికాదని కూనంనేని అన్నారు. గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read more