చెల్లని రూపాయి కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-11T09:23:47+05:30 IST

చెల్లని రూపాయి కేసీఆర్‌

చెల్లని రూపాయి కేసీఆర్‌

దేశాన్ని పాలించే సత్తా ఆయనకు లేదు: ఈటల  


యాదాద్రి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చెల్లని రూపాయి కేసీఆర్‌ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు దేశాన్ని పాలించే సత్తా, శక్తి లేదని, ఆయనవి బఫూన్‌ మాటలుగా ప్రజలు అనుకొని నవ్వుకుంటున్నారన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఆయనపై విశ్వాసంలేదని చెప్పారు. కేసీఆర్‌ వ్యవహారం కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చాలా మంది సర్పంచులు తనకు ఫోన్‌ చేసి తామంతా మనుషులుగా టీఆర్‌ఎ్‌సలో ఉన్నామని, మనసంతా మీతో ఉందని చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పకపోతే బతుకు లేదని, కట్టు బానిసలుగా చూస్తున్నారని, సర్పంచులకు గౌరవం లేకుండా చేశారని మండిపడ్డారు.

Read more