-
-
Home » Miscellaneous » telangana news chsh-NGTS-
-
మునుగోడులో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో
ABN , First Publish Date - 2022-09-11T09:23:06+05:30 IST
మునుగోడులో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో

షర్మిలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్
వనపర్తి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ‘నువ్వు రాజన్న బిడ్డవైతే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకో’ అని వైస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండలంలో శనివారం నిర్వహించిన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ గడ్డమీద అహంకారపు మాటలు సరికావని, ఒక్క మాట అంటే వందమాటలు అనాల్సి వస్తుందని షర్మిలను ఉద్దేశించి హెచ్చరించారు. శుక్రవారం ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వనపర్తిలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకొని పని చేస్తున్న చరిత్ర తనదని, రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర షర్మిలదని ఆరోపించారు.