Small plane crash: విద్యుత్ లైన్లపై కూలిన చిన్న విమానం

ABN , First Publish Date - 2022-11-28T07:14:13+05:30 IST

అమెరికా దేశంలో ఆదివారం సాయంత్రం చిన్న విమానం కుప్పకూలిపోయింది...

Small plane crash: విద్యుత్ లైన్లపై కూలిన చిన్న విమానం
US Small Plane Crash

గైథర్స్‌బర్గ్(యూఎస్): అమెరికా దేశంలో ఆదివారం సాయంత్రం చిన్న విమానం కుప్పకూలిపోయింది. (US Small plane)మేరీల్యాండ్‌లో ఆదివారం సాయంత్రం ఒక చిన్న విమానం కూలిపోయి లైవ్ విద్యుత్ తీగల్లో(Power Lines) చిక్కుకుంది.(Crash)సహాయ సిబ్బంది విమానంలో చిక్కుకుపోయిన ఇద్దరు ప్రయాణికులను గాయపడకుండా కాపాడారు.

మేరీల్యాండ్‌లో( Maryland) లైవ్ పవర్ లైన్‌లలో చిన్న విమానం చిక్కుకున్న తర్వాత 80,000 మంది ప్రజలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.విమానంలో ఎంత మంది ఉన్నారనేది వెంటనే తెలియరాలేదు. మోంట్‌గోమెరీ కౌంటీ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ ముఖ్య ప్రతినిధి పీట్ పిరింగర్ విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని మొదట ట్వీట్ చేశారు. అనంతరం విమానంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారు గాయపడలేదని పీట్ పిరింగర్ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

విమానం 100 అడుగుల ఎత్తులో పవర్ టవర్ విద్యుత్ లైన్లలో ఇరుక్కు పోయింది. వాషింగ్టన్, డికి వాయువ్యంగా 24 మైళ్ల (39 కిలోమీటర్లు) దూరంలో ఉన్న చిన్న నగరం గైథర్స్‌బర్గ్‌లో క్రాష్ జరిగింది.వాషింగ్టన్ డీకి వాయువ్యంగా 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న నగరం గైథర్స్‌బర్గ్‌లో ఈ విమానం క్రాష్ జరిగింది.

Updated Date - 2022-11-28T07:30:11+05:30 IST