plane crashes: కొలంబియాలో భవనంపై కూలిన విమానం...8మంది మృతి

ABN , First Publish Date - 2022-11-22T11:27:13+05:30 IST

కొలంబియా దేశంలోని ఓ నగరంలో ఓ చిన్న విమానం కుప్పకూలి పోయింది...

plane crashes: కొలంబియాలో భవనంపై కూలిన విమానం...8మంది మృతి
Small Plane Crashes

మెడెలిన్‌ (కొలంబియా): కొలంబియా దేశంలోని ఓ నగరంలో ఓ చిన్న విమానం కుప్పకూలి పోయింది. కొలంబియాలోని(Colombia) రెండవ అతిపెద్ద నగరం మెడెలిన్‌లోని నివాస ప్రాంతంలో ఒక చిన్న విమానం(Small plane) కూలిపోయిందని(Plane Crashes) విమానాశ్రయ అధికారులు, మేయర్ తెలిపారు.ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు. ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరి ఇంజిన్ వైఫల్యంతో ఇంటిపై కుప్పకూలి పోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

సోషల్ మీడియాలో వీడియో

విమానం ఇంటిపై కూలిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు. విమానం క్రాష్ తర్వాత దట్టమైన నల్లటి పొగలు గాలిలో కనిపించాయి. విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో సహా 8 మంది ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విమానం కూలిన ఇంట్లో ఎవరూ గాయపడినట్లు లేదా మరణించినట్లు తెలియలేదు.

Updated Date - 2022-11-22T11:44:52+05:30 IST