Peru: పెడ్రో కాస్టిల్లోపై అభిశంసన...పెరూ కొత్త అధ్యక్షురాలిగా డినా బోలువార్టే ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-12-08T05:43:05+05:30 IST

పెరూ దేశ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో అభిశంసన అనంతరం పెరూవియన్ ఉపాధ్యక్షురాలైన దినా బోలువార్టే కొత్త అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం ....

Peru: పెడ్రో కాస్టిల్లోపై అభిశంసన...పెరూ కొత్త అధ్యక్షురాలిగా డినా బోలువార్టే ప్రమాణస్వీకారం
Peruvian president Boluarte

లిమా(పెరూ): పెరూ దేశ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో అభిశంసన అనంతరం పెరూవియన్ దేశ రాజకీయ నాయకురాలు, ఉపాధ్యక్షురాలైన దినా బోలువార్టే కొత్త అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. (Peru)పెరూ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో తొలగింపు(Castillo Removal) తర్వాత అతను శాసనసభను రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని తిప్పికొడుతూ పెరూ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బోలువార్టే(Dina Boluarte) ఎంపికయ్యారు.(President) ‘‘పెరూవియన్లందరి ఐక్యత కోసం పిలుపునివ్వడం నా మొదటి పని, జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని స్థాపించడానికి రాజకీయంగా కృషి చేస్తాను’’ అని కొత్త అధ్యక్షురాలు బోలువార్టే చెప్పారు. పెరూలో కొన్ని సంవత్సరాలుగా రాజకీయ గందరగోళం ఏర్పడింది. పెరూలో గత మూడు దశాబ్దాలుగా అవినీతి ఆరోపణలపై పలువురు అధ్యక్షులు పదవుల నుంచి తొలగింపునకు గురయ్యారు.

Updated Date - 2022-12-08T07:33:27+05:30 IST