Nepal polls: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏడోసారి ఎన్నిక

ABN , First Publish Date - 2022-11-23T07:57:16+05:30 IST

నేపాల్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా(Nepal PM Sher Bahadur Deuba) మరోసారి..

Nepal polls: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏడోసారి ఎన్నిక
Nepal PM Sher Bahadur Deuba

ఖాట్మండు(నేపాల్): నేపాల్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా(Nepal PM Sher Bahadur Deuba) మరోసారి విజయం సాధించారు. దేవుబా వరుసగా ఏడోసారి దదేల్‌ధురా(Dadeldhura) నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.(Elected)నేపాల్(Nepal) ప్రతినిధుల సభ (హెచ్‌ఓఆర్), ఏడు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో 275 మంది పార్లమెంటు సభ్యుల్లో 165 మంది ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా, మిగిలిన 110 మందిని దామాషా ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు. మొత్తం 550 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీల్లో 330 మందిని నేరుగా, 220 మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకోనున్నారు.

Updated Date - 2022-11-23T08:23:51+05:30 IST