ఓపీఎస్‌ పునరుద్ధరణ ప్రతిపాదన లేదనడం హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-12-13T04:00:24+05:30 IST

నేషనల్‌ పెన్షన్‌ సిస్టం(ఎన్‌పీఎ్‌స)ను ఉపసంహరించుకుని ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించే ప్రతిపాదనేదీ కేంద్రం ...

ఓపీఎస్‌ పునరుద్ధరణ ప్రతిపాదన లేదనడం హాస్యాస్పదం

ఎన్‌ఎంఓపీఎస్‌ జాతీయ సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ పెన్షన్‌ సిస్టం(ఎన్‌పీఎ్‌స)ను ఉపసంహరించుకుని ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించే ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌ఎంఓపీఎ్‌స) జాతీయ సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ అన్నారు. ఓపీఎస్‌ పునరుద్ధరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందా అని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. అలాంటి ప్రతిపాదనేదీ లేద ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా.భగవత్‌ కరాద్‌ సమాధానమిచ్చారు.

ఇది దేశంలోని 80 లక్షల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులను అవమానించడమేనని స్థితప్రజ్ఞ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఓపీఎ్‌సను పునరుద్ధరించాయని తెలిపారు. ఓపీఎ్‌సను పునరుద్ధరించిన రాష్ట్రాలకు ఎన్‌పీఎ్‌స ట్రస్టులో జమ చేసిన ఉద్యోగుల తాలూకు కాంట్రిబ్యూషన్‌ సొమ్మును తిరిగి చెల్లిస్తారా లేదా అని ఒవైసీ అడగ్గా.. అలాంటి నిబంధన పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చట్టం-2013లో లేదని మంత్రి సమాధానమిచ్చారని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్‌పీఎ్‌సను రద్దు చేసి ఓపీఎ్‌సను పునరుద్ధరించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-13T04:00:24+05:30 IST

Read more