జీ 20, ఎస్‌సీఓలో భారత అధ్యక్షతతో ప్రపంచ సుస్థిరత

ABN , First Publish Date - 2022-12-31T05:10:23+05:30 IST

షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎ్‌ససీఓ), జీ 20ల్లో భారత్‌ అధ్యక్షత ప్రపంచానికి ఆసియాతో పాటు ప్రపంచానికి కూడా సుస్థిరత, భద్రతను అందిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా అభిప్రాయపడ్డారు.

జీ 20, ఎస్‌సీఓలో భారత అధ్యక్షతతో ప్రపంచ సుస్థిరత

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ధీమా

మాస్కో, డిసెంబరు 30: షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎ్‌ససీఓ), జీ 20ల్లో భారత్‌ అధ్యక్షత ప్రపంచానికి ఆసియాతో పాటు ప్రపంచానికి కూడా సుస్థిరత, భద్రతను అందిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా అభిప్రాయపడ్డారు. అదే విధంగా తమ దేశంతో ఉన్న సహకారం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ ఆయన ఒక సందేశాన్ని పంపించారు. భారత్‌, రష్యాల ద్వైపాక్షిక బంధం ఈ ఏడాదితో 75ఏళ్లకు చేరిందని ఆయన అందులో గుర్తుచేశారు. ‘‘మన రెండు దేశాలు స్నేహం, పరస్పర గౌరవంపై ఆధారపడి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృ ద్ధి చేసుకుంటున్నాయి. ఇంధన, సైనిక సాంకేతిత సహా అనేక రంగాల్లో భారీ వాణిజ్య, ఆర్థిక ప్రాజెక్టులను సం యుక్తంగా చేపడుతున్నాం. ప్రాంతీయ, భౌగోళిక అంశాలపై కీలక విషయాలను చర్చిస్తున్నాం. భారత్‌ ఇటీవల చేపట్టి ఎస్‌సీఓ, జీ 20 సదస్సుల అధ్యక్షతలు మన బంధం మధ్య కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తాయని విశ్వసిస్తున్నాను’’ అని పుతిన్‌ పేర్కొన్నారు. ఎస్‌సీఓకు ఈ ఏడాది సెప్టెంబరు 16న, జీ 20 అధ్యక్షతకు ఈ నెల 1న భారత్‌ అధ్యక్షతను స్వీకరించింది.

Updated Date - 2022-12-31T05:10:24+05:30 IST