నడి వయసులో... నవ యవ్వనంగా ఉండాంటే..!

ABN , First Publish Date - 2022-09-24T19:54:09+05:30 IST

వయసు పైబడే కొద్దీ మన చర్మం, మన ముఖ కవళికలు మారతాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మేకప్‌ కూడా మార్చుకోవాలి

నడి వయసులో... నవ యవ్వనంగా ఉండాంటే..!

యసు పైబడే కొద్దీ మన చర్మం, మన ముఖ కవళికలు మారతాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మేకప్‌ కూడా మార్చుకోవాలి. వయసును దాచేసి, నవయవ్వనంతో మెరిసిపోయేలా మేకప్‌ చిట్కాలను ఎంచుకోవాలి. 


అతి అనర్థమే: ముఖం మీద పైబడే వయసు సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగని వాటిని దాచడం కోసం అవసరానికి మించి మేకప్‌ వేస్తే అసలుకే మోసం వస్తుంది. మేకప్‌ ముడతల్లో ఇమిడిపోయి, గీతలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి మేకప్‌ ముఖ కవళికలను పూర్తిగా మార్చేసే ప్రయత్నం చేయకుండా, వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి.


లిక్విడ్‌ మేకప్‌: వయసు పైబడేకొద్దీ చర్మం తేమ కోల్పోయి, పొడిగా మారుతుంది. కాబట్టి చర్మం నునుపుగా, యవ్వనంగా కనిపించడం కోసం లిక్విడ్‌ మేకప్‌ ఉత్పత్తులు ఎంచుకోవాలి. లిక్విడ్‌ ఫౌండేషన్‌తో పాటు, బ్లషెస్‌, బ్రాంజర్స్‌ కూడా ద్రవ రూపంలోనివే ఎంచుకోవాలి.


మాయిశ్చరైజర్‌: మాయిశ్చరైజర్‌ వాడకాన్ని పెంచాలి. ప్రతి రాత్రీ నిద్రకు ముందు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా అప్లై చేసుకోవడంతో పాటు ఉదయం మేక్‌పకు ముందు టింటెడ్‌ మాయిశ్చరైజర్‌ను పూసుకోవాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది.


న్యాచురల్‌ గ్లో: పైబడే వయసుతో చర్మం సహజసిద్ధమైన మెరుపును కోల్పోతుంది. కాబట్టి బ్లషర్‌, బ్రాంజర్ల వాడకాన్ని తగ్గంచి, బదులుగా లిక్విడ్‌ హైలైటర్‌ను పెంచాలి. ఫౌండేషన్‌లో కొన్ని చుక్కల లిక్విడ్‌ హైలైటర్‌ను కలిపి, చర్మానికి అప్లై చేసుకోవాలి.


ఐ మేకప్‌: వీలైనంత తక్కువ ఐమేకప్‌ చేసుకోవాలి. ముదురు రంగు, స్మోకీ కలర్స్‌కు బదులుగా తేలికపాటి రంగులను ఎంచుకోవాలి. ముదురు రంగు ఐలైనర్‌, ఐ షాడోలతో వయసుకు మించి పెద్దవారిలా కనిపించే వీలుంది. కాబట్టి తేలిక రంగులే ఎంచుకోవాలి.

Read more