కాల్షియం సప్లిమెంట్లు ఎవరెవరు, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-04T17:30:18+05:30 IST

క్యాల్షియం సప్లిమెంట్ల మీద అవగాహన పెరిగింది. అయితే క్యాల్షియం మోతాదు వ్యక్తులు, వయసులను బట్టి మారుతుంది

కాల్షియం సప్లిమెంట్లు ఎవరెవరు, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసా?

ఆంధ్రజ్యోతి(04-01-2022)

క్యాల్షియం సప్లిమెంట్ల మీద అవగాహన పెరిగింది. అయితే క్యాల్షియం మోతాదు వ్యక్తులు, వయసులను బట్టి మారుతుంది. 


గర్భిణులు, పాలిచ్చే తల్లులు పాలు తాగడంతో పాటు, రోజుకి 2 గ్రాముల క్యాల్షియం సప్లిమెంటు అదనంగా తీసుకోవాలి. 


ప్రి మెనోపాజ్‌ దశలో (అమెనోరియా) మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తయారవదు. కాబట్టి రోజుకి ఒకటిన్నర గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. 


మెనోపాజ్‌కు చేరుకున్న తర్వాత అవసరాన్నిబట్టి ఒకటిన్నర నుంచి 2 గ్రాముల వరకూ క్యాల్షియం తీసుకోవచ్చు. 


తీవ్ర రుగ్మత నుంచి కోలుకుంటున్న దశలో కూడా ఎక్కువ క్యాల్షియం అవసరమవుతుంది. 


అయితే ఎంత క్యాల్షియం అవసరమనేది తెలుసుకోవటం కోసం ఎముకల వైద్యుల చేత పరీక్షలు చేయించుకుని, సూచించిన మోతాదు మేరకు తీసుకోవాలి. 

Read more