మేకప్‌ మెటీరియల్‌ ఇలా...

ABN , First Publish Date - 2022-09-10T18:37:22+05:30 IST

మేకప్‌ వేసుకునే ప్రతి ఒక్కరూ మేకప్‌ మెటీరియల్‌(Makeup material) గురించి కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి

మేకప్‌ మెటీరియల్‌ ఇలా...

మేకప్‌ వేసుకునే ప్రతి ఒక్కరూ మేకప్‌ మెటీరియల్‌(Makeup material) గురించి కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి. అప్పుడే చర్మానికి నప్పేలా మేకప్‌ వేసుకోగలుగుతారు. అందుకోసం ఇవిగో ఈ మెటీరియల్స్‌ గురించి తప్పక తెలుసుకోవాలి.

టోనర్‌: చర్మం నునుపుగా, బిగుతుగా మేకప్‌కు అనువుగా మారడం కోసం టోనర్‌ వాడడం తప్పనిసరి. అలాగే మొటిమలు, మచ్చలు ఉన్న చోట టోనర్‌ను అప్లై చేసుకుని, వాటిని కనిపించకుండా దాచేయవచ్చు.

మాయిశ్చరైజర్‌: మేకప్‌ సమంగా పరుచుకోవడం కోసం మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్‌ వాడుకోవాలి. మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల చర్మం మీద మేకప్‌ పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది.

ప్రైమర్‌: చర్మానికీ, మేకప్‌కూ మధ్య ప్రైమర్‌ అడ్డుగా ఉండి, చర్మం మీది రంధ్రాలు కనిపించకుండా చేస్తుంది. దీంతో చర్మ రంధ్రాలు పూడుకుపోకుండా ఉంటాయి.

ఫౌండేషన్‌: స్కిన్‌ టోన్‌ను సమం చేసి, మేకప్‌కు బేస్‌గా మారుతుంది. కాబట్టి, ఫౌండేషన్‌ను ముఖం మీద సమంగా పరుచుకోవాలి.

కన్‌సీలర్‌: చర్మపు రంగుకు ఒకటి లేదా రెండు టోన్ల తేలిక రంగు కన్‌సీలర్‌ ఎంచుకోవాలి. దీంతో మచ్చలను దాచేసి, ముఖంలో కనురెప్పలు, ముక్కు, చుబుకం, చెక్కిళ్లను హైలైట్‌ చేసుకోవచ్చు.

కాంటూర్‌: దీంతో ముఖానికి ఆకారాన్ని తీసుకురావచ్చు. ముక్కు, చుబుకం, చెక్కిళ్లను ఆకర్షణీయంగా మలుచుకోవచ్చు. 

బ్లష్‌: చెక్కిళ్లను హైలైట్‌ చేయడం కోసం దీన్ని వాడుకోవాలి.

Read more