కేన్సర్‌కు ఈ లక్షణాలే సూచనలు

ABN , First Publish Date - 2022-09-13T18:40:26+05:30 IST

కేన్సర్‌ వ్యాధి బయల్పడడానికంటే ముందు కొన్ని సాధారణ నలతలు తరచూ వేధిస్తూ ఉంటాయి. అవేంటంటే...

కేన్సర్‌కు ఈ లక్షణాలే సూచనలు

కేన్సర్‌ వ్యాధి బయల్పడడానికంటే ముందు కొన్ని సాధారణ నలతలు తరచూ వేధిస్తూ ఉంటాయి. అవేంటంటే...


చర్మ సమస్యలు: ఆహారం, సౌందర్య సాధనాలతో సంబంధం లేకుండా చర్మ సమస్యలు మొదలవుతాయి. హఠాత్తుగా మొదలయ్యే ఈ చర్మ సమస్యలు చర్మపు అలర్జీలను కూడా పోలి ఉండవు. ఈ సమస్యతో పాటు రొమ్ముల్లో గడ్డలు ఉన్న అనుమానం వస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.

దగ్గు: దగ్గు విడవకుండా వేధిస్తూ, ఆకలి మందగించినా, నిస్సత్తువ ఆవరిస్తున్నా వైద్యులను సంప్రతించాలి. దగ్గు, ఆకలీ, బరువూ తగ్గడం కేన్సర్‌ ప్రధాన లక్షణాలు. 

దురదలు: దురద పెరుగుతున్న కేన్సర్‌ కణితికి సూచన కావచ్చు. ఇది స్కిన్‌ ఎలర్జీ ప్రధాన లక్షణమైనా, దురద తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. బైల్‌ డక్ట్‌, చర్మ కేన్సర్లు, కాలేయానికి పాకే కేన్సర్లు, రక్త కేన్సర్‌లలో దురద ప్రధాన లక్షణంగా ఉంటుంది.

విసర్జన: మలంలో మ్యూకస్‌, రక్తం, చీము కనిపిస్తే, పెద్ద పేగు కేన్సర్‌గా అనుమానించాలి. 

మూత్రం: రక్తంతో కూడిన మూత్రం, అధిక రక్తపోటు, కటి ప్రదేశంలో నొప్పి, అలసటలు మూత్రపిండ కేన్సర్‌ లక్షణాలు.

Updated Date - 2022-09-13T18:40:26+05:30 IST