ఇవి తింటున్నారా?

ABN , First Publish Date - 2022-09-20T17:53:22+05:30 IST

మఖానా, ఫాక్స్‌ నట్‌, లోటస్‌ సీడ్‌... తామర విత్తనాలకు ఇలా రకరకాల పేర్లు. ఈ విత్తనాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం... ఇలా వెల కట్టలేనన్ని పోషకాలుంటాయి.

ఇవి తింటున్నారా?

మఖానా, ఫాక్స్‌ నట్‌, లోటస్‌ సీడ్‌... తామర విత్తనాలకు ఇలా రకరకాల పేర్లు. ఈ విత్తనాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం... ఇలా వెల కట్టలేనన్ని పోషకాలుంటాయి. 


  • వీటిలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువ. కాబట్టి భోజనానికీ, భోజనానికీ మధ్య స్నాక్‌లా తినొచ్చు. 
  • పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ. కాబట్టి రక్తపోటు ఉన్నవాళ్లు తింటే బిపి అదుపులోకొస్తుంది.
  • దీన్లో చక్కెర చాలా తక్కువ. కాబట్టి తరచుగా ఆకలితో బాధపడే మధుమేహులకు ఇది చక్కని శ్నాక్‌.
  • దీన్లో పీచు ఎక్కువ కాబట్టి మలబద్ధకం ఉన్నవాళ్లు తప్పక తినాలి.
  • వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే! వృద్ధాప్య లక్షణాలు దూరం చేయాలనుకుంటే వీటిని తరచుగా తింటూ ఉండాలి.
  • పునరుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే గుణం ఈ విత్తనాలకుంటుంది. కాబట్టి అండాలు విడుదలవని మహిళలు, వీర్యం నాణ్యత తక్కువగా ఉన్న పురుషులు ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి.
  • ఫాక్స్‌ నట్స్‌ నిద్రలేమినీ పోగొడతాయి.
  • కాఫీ అడిక్షన్‌ పోగొట్టుకోవాలని అనుకుంటే, కాఫీ తాగాలనిపించినప్పుడంతా వీటినే తింటూ ఉండాలి.

Updated Date - 2022-09-20T17:53:22+05:30 IST