కాస్మటిక్స్‌ ఆచితూచి..

ABN , First Publish Date - 2022-10-04T21:32:17+05:30 IST

సౌందర్య సాధనాలతో తాత్కాలికంగా ఆకర్షణ పెరిగే మాట వాస్తవమే అయినా, వాడకం మితిమీరితే శాశ్వత చర్మ సమస్యలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం!

కాస్మటిక్స్‌ ఆచితూచి..

సౌందర్య సాధనాలతో తాత్కాలికంగా ఆకర్షణ పెరిగే మాట వాస్తవమే అయినా, వాడకం మితిమీరితే శాశ్వత చర్మ సమస్యలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం!


తలనొప్పులు: సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు, పదార్థాలు వాతావరణ మార్పులకు స్పందించి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఫలితంగా తలనొప్పులు, తల తిరుగుడు లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. మరీ ముఖ్యంగా మైగ్రెయిన్‌, తీవ్రమైన తలనొప్పి మొదలైన సమస్యలున్నవాళ్లు కాస్మటిక్స్‌ వాడకాన్ని తగ్గించుకోవాలి.


నల్లని వలయాలు: ముఖంలో కళ్ల కింది చర్మం అత్యంత సున్నితమైనది. కాబట్టి కాస్మటిక్స్‌లోని రసాయనాలు కళ్ల దిగువ ప్రదేశాన్ని నల్లగా మారుస్తాయి. వలయాలతో పాటు, ఐ బ్యాగ్స్‌ సమస్యలూ తెచ్చి పెడతాయి. కాబట్టి కంటి దిగువన వీలైనంత తక్కువ మేకప్‌ ఉపయోగించాలి. కళ్ల కోసం వాడే కాస్మటిక్స్‌ మన్నికైనవై ఉండాలి.


చర్మ రంధ్రాలు: ఫౌండేషన్‌, ప్రైమర్లు చర్మాన్ని నునుపుగా మార్చినా, చర్మ రంధ్రాలను పూడ్చేస్తాయి. దాంతో చర్మ రంధ్రాలకు గాలి సోకే వీలు లేక మొటిమలు, మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి ఆయిల్‌ బేస్‌డ్‌ కాస్మటిక్స్‌కు బదులుగా, నాన్‌ యాక్నెజెనిక్‌ మేకప్‌ సాధనాలు ఎంచుకోవాలి.

Read more