ట్రైజెమినల్‌ న్యూరాల్జియా

ABN , First Publish Date - 2022-09-20T17:28:07+05:30 IST

అత్యాధునిక చికిత్స పద్దతితో రేడి యో ఫ్రిక్వెన్సీని(RF) ఉపయోగించి చిన్న సూదితో శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ట్రైజెమినల్‌ న్యూరాల్జియా

ఆత్మహత్యకు పురిగొల్పే వ్యాధి


అత్యాధునిక చికిత్స పద్దతితో రేడి యో ఫ్రిక్వెన్సీని(RF) ఉపయోగించి చిన్న సూదితో శాశ్వత పరిష్కారం లభిస్తుంది.


ట్రైజెమినల్‌ న్యూరాల్జియా (త్రిధార నాడీ సంబంధ నొప్పి) అనే రుగ్మత, ముఖం మీద షాక్‌ను పోలిన తీవ్రమైన నొప్పికి లోను చేసే బాధాకరమైన పరిస్థితి. నాడికి వ్యాధి సోకడం, లేదా గాయం మూలంగా నొప్పితో వేధించే సమస్య... న్యూరాల్జియా. ట్రైజెమినల్‌ నాడి ముఖానికి సంకేతాలు అందించే మన శరీరంలోని ఐదవ నాడి. నాడి చుట్టూరా ఉన్న నిర్మాణాలతో నాడి ఒత్తిడికి లోనైనప్పుడు న్యూరాల్జియా తలెత్తుతుంది. నాడి చుట్టూ కణితి పెరిగినా ఇదే సమస్య తలెత్తుతుంది. 


ఈ స్థితిని గుర్తించేదిలా...

కొంతమందిలో గుచ్చినట్టు ముఖానికి విద్యుత్‌ షాక్‌ తగిలినట్టు అనిపించవచ్చు. కొంతమంది రోగుల్లో ముఖ కండరాలు లాగుతూ ఉంటాయి. దవడ, పైపెదవి, దంతాలు, చెవులకు విద్యుత్‌ షాక్‌ తగిలినట్టు అనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే దంతాల నొప్పులు వేధిస్తాయి. కాలక్రమేణా నొప్పి తీవ్రత పెరుగుతుంది. ట్రైజెమినల్‌ న్యూరాల్జియా ముఖంలో ఒక వైపే వస్తుంది. రెండు వైపులా రాదు. రెండు వైపులా తలెత్తితే, న్యూరాల్జియాకు బదులుగా, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అనే నాడీ సంబంధ రుగ్మత అని అనుమానించాలి. న్యూరాల్జియా నొప్పి అదే పనిగా వేధిస్తూ ఉండవచ్చు, వచ్చి పోతూ ఉండవచ్చు. తక్కువ వ్యవధులతో వేధిస్తూ ఉండవచ్చు.


నొప్పి కారకాలు

దంత ధావనం, గడ్డం గీసుకోవడం, ముఖం కడుక్కోవడం, చల్లని గాలికి బహిర్గతమవడం, భోంచేయడం, నీళ్లు తాగడం.. ఈ పనులతో న్యూరాల్జియా నొప్పి మొదలవుతూ ఉంటుంది.


ఏ వయస్కుల్లో ఎక్కువ?

త్రిధార నాడి మీద ఎటువంటి ఒత్తిడీ పడకపోయినా, రోగుల్లో ట్రైజెమినల్‌ న్యూరాల్జియా తలెత్తుతుంది. 40 ఏళ్లు పైబడిన వాళ్లలో ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. యువతలో కూడా ఈ సమస్య ఉంటుంది. పురుషుల కంటే మహిళల్లో ఈ వ్యాధి సర్వసాధారణం. 


వ్యాధి నిర్థారణ ఇలా...

మెదడు ఎమ్మారై ద్వారా త్రిధార నాడి మీద ఒత్తిడిని నిర్ధారించవచ్చు. నొప్పి రకం, ప్రదేశం, ప్రేరేపించే కారకాలను కూడా గుర్తించవచ్చు. న్యూరాల్జియా కారకాలైన సైనసైటిస్‌, కణుతులు కూడా ఈ పరీక్షతో బయల్పడతాయి.


చికిత్సలున్నాయి

మందులు: ఈ సమస్యకు వాడుకోవలసిన మందు కార్బ్‌మజెపిన్‌. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే వాడుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి, పొందే ఉపశమనం ఆధారంగా వైద్యులు మందు మోతాదును తగ్గిస్తారు. 

సర్జరీ (మైక్రో వాస్క్యులర్‌ డీకంప్రెషన్‌) : న్యూరోసర్జన్‌చే మెదడును తెరచి సర్జరీ చేయబడును. ఇందులో ఒక ప్యాచ్‌ సహాయంతో త్రిధార నాడీపై ఒత్తిడి కలిగించే రక్తనాళం వేరు చేయబడును. ఈ ప్రధాన సర్జరీకై పేషెంట్‌ ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. మరియు చిక్కులు కూడా అధికమే. 

రేడియో ఫ్రీక్వెన్సీ: ఈ నాన్‌ సర్జికల్‌ చికిత్సలో త్రిఽధార నాడికి నొప్పి సంకేతాలు చేరవేయడం నిలిపి వేయబడును. చిన్న సూదితో ఈ పద్ధతికి 15-20 నిమిషాలు పడుతుంది, పెద్దగా చిక్కులు ఉండవు మరియు పేషెంట్‌ రెండు గంటల వ్యవధిలోనే విడుదల చేయబడతారు. నొప్పి ఉపశమన ఫలితాలు సర్జరీలానే ఉంటాయి.


అత్యాధునికమైన, సురక్షితమైన చికిత్స

  • త్రిధార నాడీ ముడిని తొలగించే అత్యాధునిక చికిత్స.. రేడియోఫ్రీక్వెన్సీ
  • ఇది ఇమేజ్‌ గైడెన్స్‌, మినిమల్‌ సెడేషన్‌ పరిధిలో చేసే నాన్‌ సర్జికల్‌, డే కేర్‌ ప్రొసిజర్‌
  • ఈ చికిత్సకు ఒక గంట సమయం పడుతుంది.
  • నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
  • అదే రోజు దైనందిన కార్యక్రమాలు కొనసాగించవచ్చు
  • రోగి మూడు నెలల పాటు నోట్లో ఒకే వైపు నమలకూడదు. గట్టి పదార్థాలు తినకూడదు.


-డాక్టర్ సుధీర్ దారా

MBBS, MD IAPM

ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ EPIONE, సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ బియాండ్, 

ఫోర్త్ ఫ్లోర్, అపురూప పిసిహెచ్, రోడ్ నెంబరు 2, బంజారాహిల్స్, హైదరాబాద్-33

ఫోన్: 875-875-875-1,

846-604-444-1Read more