Remedy: స్పైసెస్‌తో సూపర్‌ హెల్త్‌

ABN , First Publish Date - 2022-11-22T13:07:00+05:30 IST

సుగంధ ద్రవ్యాలు వంటకాల రుచి పెంచడంతో పాటు స్వల్ప అస్వస్థతలకు విరుగుడుగా కూడా పని చేస్తాయి. ఎలాగంటే...

Remedy: స్పైసెస్‌తో సూపర్‌ హెల్త్‌
సూపర్‌ హెల్త్‌

సుగంధ ద్రవ్యాలు వంటకాల రుచి పెంచడంతో పాటు స్వల్ప అస్వస్థతలకు విరుగుడుగా కూడా పని చేస్తాయి. ఎలాగంటే...

అల్లం: అల్లం టీ తాగితే తలనొప్పి తగ్గడంతో పాటు తలతిరుగుడు కూడా అదుపులోకి వస్తుంది.

జాజికాయ: నిద్రలేమికి జాజికాయ ఉత్తమమైన ఔషధం. జాజికాయ పొడిని మాంసాహార వంటకాలతో పాటు పాలలో కూడా కలుపుకుని తీసుకోవచ్చు.

మెంతులు: వెంట్రుకలు ఊడడం, పలుచనవడం, పొడిబారడం లాంటి సమస్యలకు మెంతులు మెరుగ్గా పని చేస్తాయి. రాత్రంతా నీళ్లలో నానబెట్టి, మరుసటి రోజు మెత్తని పేస్ట్‌లా చేసుకుని వెంట్రుకలకు పట్టించి తలస్నానం చేయాలి.

దాల్చిన చెక్క: నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను సంహరిస్తుంది. టీలో దాల్చిన చెక్క పొడి కలుపుకోవచ్చు. వంటకాల్లో వాడుకోవచ్చు. నచ్చితే ప్రతి రోజూ అంగుళం ముక్క నమలవచ్చు.

జీలకర్ర: అధిక బరువును జీలకర్రతో తగ్గించుకోవచ్చు. క్యాలరీలను కరిగించడంతో పాటు, మెటబాలిజం పెరగడానికి తోడ్పడే జీలకర్ర జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ పొడిని గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగవచ్చు.

మిరియాలు: దగ్గుకు మిరియాల పొడి భేషుగ్గా పని చేస్తుంది. ఈ పొడికి తేనె కలిపి తీసుకుంటే దగ్గు, గొంతులో గరగర అదుపులోకొస్తాయి.

Updated Date - 2022-11-22T13:07:00+05:30 IST

Read more