National Pollution Control Day: కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నదెవరూ..!

ABN , First Publish Date - 2022-12-02T11:25:00+05:30 IST

కాలుష్యం ప్రజల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

National Pollution Control Day: కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నదెవరూ..!
National Pollution Control Day

భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో కోల్పోయిన విలువైన జీవితాలను స్మరించుకునే రోజుగా ఈరోజు గుర్తించబడింది. ఈరోజును జరుపుకోవడం వెనుక ప్రధాన లక్ష్యం, పారిశ్రామిక విపత్తులను నివారించడానికి, మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక ఉద్గారాల వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, నీరు, నేల, శబ్దం, అనేక ఇతర రకాల కాలుష్యాల కారణంగా పర్యావరణం చాలా కాలంగా రాజీపడింది. దీపావళినాడు కాల్చే క్రాకర్లు, పరిశ్రమల ద్వారా గ్యాస్‌ల లీకేజీ, పేలుళ్లు, రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు, గాలిలోకి వెలువడుతున్న ప్రమాదకర వాయువులు, ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలతో గాలి కాలుష్యం పెరుగుతూనే ఉంది. మరెన్నో సహా అనేక అంశాలు కాలుష్యం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

ఈ పెరుగుతున్న కాలుష్యం ప్రజల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి, స్వచ్ఛమైన నీటిని త్రాగడానికి, హక్కుతో చేసే నిర్లష్యలు కూడా కాలుష్యం ప్రపంచ సమస్యగా మారేందుకు, మన చుట్టూ ఉండే గాలి, మనం వాడే నీరు కాలుష్యం కావడానికి కారణమవుతుంది.

WhatsApp Image 2022-12-02 at 11.19.14 AM (2).jpeg

మనకు తెలియకుండానే ప్రకృతిలో ఉండే వికృతాలను కూడా పెంచి పోషిస్తున్నాము, వాటిలో ముఖ్యంగా మొక్కలు.. పక్షులు ఈ మధ్య కాలంలో దారులకు ఇరుప్రక్కలా కనిపిస్తున్న ఒక వృక్షం విషపూరితమైనదని తెలిసి కూడా దానిని పెంచుతూనే ఉన్నారు. ఇది ప్రాణాలను హరించేసే చెట్టు. అలాగే నగరాలలో పావురాల సంఖ్య గణనీయంగా పెరగడం వాటి వ్యర్థాలు ఊపిరి సమస్యలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం.

పావురాల ద్వారా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. వీటి రెక్కలు, వ్యర్థాల వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. వీటి వల్ల చర్మం, నోరు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, ఉదరకోశం దెబ్బతినే ప్రమాదం ఉందట. నగరంలో విపరీతంగా పెరిగి పోతున్న పావురాల సంతతిని కట్టడి చేయాలనే డిమాండ్‌ గత కొన్నేండ్లుగా వినిపిస్తోంది. ఇది తెలియకుండానే పెరుగుతున్న మరో ముప్పు.

ఇక పంట పండించిన తరువాత మిగిలే వ్యర్థాలను తగలబెట్టే పనిలో గాలి కాలుష్యాన్ని మనమే పెంచి పోషిస్తున్నాం. దీపావళినాడు, పెళ్ళిళ్లు, సంబరాల్లో కాల్చే బాణాసంచా కూడా గాలి కాలుష్యానికి కారకమే. విపరీతమైన ఫ్లాస్టిక్ వాడకం ఇవి మన నిర్లష్యాల జాబితాలో కొన్ని మాత్రామే.. నీటిని వృథా చేస్తూ, మురికిని రోడ్ల మీదకు వదిలేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నదీ మనమే. మన చర్యలే మనకు శాపాలుగా మారి మన ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి.

ప్రాణవాయువునిచ్చి, మన ప్రాణాలని కాపాడే చెట్లు ప్రాణాలు హరించేవిగా కూడా ఉంటాయనే విషయం మీకు తెలుసా..?. అలాంటి వాటిలో ఒకటి మంచినీల్ చెట్టు. పూల జాతికి చెందిన ఈ చెట్టు. అచ్చం యాపిల్‌ చెట్లను పోలి ఉండే విషపూరితమైనది. దీనికి చిన్న చిన్న పండ్లు కాస్తాయి. బీచ్ యాపిల్పేరుతో పిలిచే ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారుతుంటుంది. ఆ పాలను ముట్టుకుంటే… ఒంటిపై దద్దుర్లు వస్తాయి. చెట్టు బెరడ దగ్గర నుంచి… వెళ్ళినా మెల్లగా ఎలర్జీలు రావడం మొదలవుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చెట్ల కిందకు వెళ్తే అంతే సంగతులు. చెట్టు పాల వల్ల చర్మంపై మంట, నొప్పి మొదలవుతోంది. ఈ చెట్టు పాలు కళ్లలో పడితే.. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. చివరికి ఈ చెట్లు తగలబెడితే.. ఈ పొగ వల్ల కళ్ల సమస్యలు మొదలవుతాయి. ఈ పండ్లను తింటే.. నోట్లో మంట మొదలై.. గొంతు పట్టేస్తుంది. ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది.

ఏడాకుల చెట్టు అనే ఈ సొగసైన సతతహరిత వృక్షం భారతదేశం అంతా కనిపిస్తుంది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఆల్స్టోనియా స్కాలరీస్. ఈ స్కాలరీస్ పేరు ఎలా వచ్చిందంటే, పాఠశాల పిల్లలకు అవసరమయిన చెక్క పలకలను తయారు చేసేందుకు ఈ చెట్టు కలపను ఉపయోగించేవారు. ఆంగ్లంలో దీనిని డెవిల్ ట్రీ అంటారు, అక్టోబరులో ఈ చెట్టు చిన్నని, ఆకుపచ్చని, సువాసన కలిగిన పూలు పూస్తాయి. ఈ చెట్టు అన్ని భాగాలు విషపూరితమైనవిగా పరిగణిస్తారు. ఈ చెక్కను సాధారణంగా ప్యాకింగ్ బాక్సుల, నల్లబల్లల తయారీలో ఉపయోగిస్తారు. తెలియకు చేస్తున్న చిన్న చిన్న నిర్లష్యాలకు పడే భారీ జరిమానాకు బలయ్యేదీ మనమే.

కాలుష్యాన్ని నియంత్రించడానికి చిట్కాలు..

1. మన ఇంట్లో ఉండే అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (VOCలు) ఉత్పత్తులను శుభ్రపరిచే(cleaning) రసాయనాల నుండి వస్తాయి. ఉదాహరణకు, శుభ్రపరిచే products లలో లిమోనెన్ ఉంటుంది, ఇది ఇంట్లో సహజంగా ఉండే ఓజోన్‌తో చర్య ద్వారా ఫార్మాల్డిహైడ్‌ ఏర్పడేలా చేస్తుంది.

2. తివాచీలు, Upholstery, దుమ్ము, పెంపుడు జంతువుల జుట్టు నుండి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి.

3. ఆహార పదార్థాలను వేయించడం వల్ల నలుసు కాలుష్యం వస్తుంది, ముఖ్యంగా గ్యాస్ స్టవ్‌లపై, NO2 వాయు కాలుష్య కారకాలతో కలిసి ఉంటుంది. వంట చేసేటప్పుడు తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.

4. చెత్తకు డస్ట్‌బిన్‌ను వాడాలి.

5. ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించడం మానుకోవాలి. కాగితం సంచులు ప్రత్యామ్నాయ పరిష్కారం.

6. పీస్ లిల్లీ, గెర్బెరా డైసీ, ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కలను పెంచుకోవాలి, ఇవి గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్‌ను తొలగించడంలో సహాయపడతాయి.h

Updated Date - 2022-12-02T14:36:50+05:30 IST